రోహిత్ కేసును రీఓపెన్‌ చేయాలి : రాధిక వేముల

Published on 

దేశ వ్యాప్తంగా సంచలనం సీంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కేసుకు సంబంధించి సరైన సాక్షాలు లేని కారణంతో మూసివేస్తున్న పోలీసులు ప్రకటించడంతో రోహిత్ వేముల కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసు మూసివేతను నిరసిస్తూ యూనివర్సిటీలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో క్యాంపస్‌లో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసుల వాదన పూర్తి అసంబద్ధం అంటోంది రోహిత్ కుటుంబం. 15 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్‌ని కలిశారు ఆయన కుటుంబ సభ్యులు, యూనివర్సిటీ అధ్యాపకులు, అతని స్నేహితులు.

అయితే విద్యార్ధుల ఆందోళనలు, ప్రభుత్వం నిర్ణయంతో ఈ కేసును ఈ రీ ఓపెన్‌ చేయాలని తెలంగాణ డీజీపీ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసు పునర్విచారణ అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేయనుంది తెలంగాణ పోలీస్‌శాఖ.

అయితే యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై వివక్షకు రోహిత్ వేముల ఉదంతం ఒక తార్కాణం అంటూ నిరసన మొదలైన విషయం తెలిసిందే. నేషనల్ మీడియాలోనూ, స్టూడెంట్స్ యూనియన్స్‌లోనూ పెద్దఎత్తున కదలిక వచ్చింది. జాతీయ నేతలు సహితం యూనివర్సిటీకి వచ్చి విద్యార్ధుల ఆందోళనకు మద్దతును ప్రకటించారు.

ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఫిర్యాదు బీజేపీ నేతలపై, అప్పటి HCU వైస్ ఛాన్స్‌లర్ అప్పారావుపై రావడంతో కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు పోలీసులు. కానీ.. గత ప్రభుత్వం వీళ్లకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చేసింది. 95 మంది సాక్షుల్ని విచారించి.. ఫోరెన్సిక్ రిపోర్ట్స్‌ని పరిశీలించి.. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నిర్ధారణకు వచ్చి.. రెండునెలల కిందటే క్లోజర్ రిపోర్ట్ రెడీ చేశారు పోలీసులు. మే 3న తుది నివేదికను తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు.

రోహిత్ వేముల ఎస్సీ కేటగిరీకి చెందినవాడు కాదని, తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ మనస్తాపం చెందాడని, అందువల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తన నివేదికను సమర్పించారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారమే అప్పటి వీసీ రోహిత్‌పై చర్యలు తీసుకున్నారని, వేధింపులనేవి శుద్ధ అబద్ధమని రిపోర్టులో పేర్కొనడంతో హెచ్‌సీయూలో ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్‌ వేయనుంది తెలంగాణ పోలీస్‌శాఖ.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form