బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

Published on 

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా వరుస పర్యటనలతో ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఆదివారం ఒక్కరోజే నిర్మల్, ఎర్రవల్లి, తుక్కుగూడలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం స్థానిక అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form