ధనుష్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాయన్’. 2024లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి మొదటి సాంగ్‌ను మే 9 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆకర్షణీయమైన చిత్రాన్ని విడుదల చేశారు. అందులో ధనుష్ నిప్పుల్లో కాలుతున్న ఇటుకలపై కూర్చుని కనిపించాడు. అతడి వెనుక రావణుడి విగ్రహం .. ఒక గుంపు చేతులు పైకెత్తి ఆయుధాలతో విరుచుకుపడుతూ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంత సీరియస్ సన్నివేశంలోను ధనుష్ నిశ్చలంగా చూస్తూ కనిపిస్తున్న చిత్రం ఆడియన్స్‌ను ఈగర్‌గా వేయిట్ చేసేలా చేస్తుంది.
అయితే ధనుష్ ఫోజ్ చూడగానే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాయన్’ అంటే రాక్షసుడా?.. 10 తలల రావణాసురుడా? అంటూ కొందరు నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రం లో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జే. సూర్య, ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్, అపర్ణ బాల మురళి, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.