టీచర్‌పై దాడి చేసిన లేడీ ప్రిన్సిపాల్‌

Published on 

ఆగ్రా లోని సీగానా గ్రామంలోని ప్రీసెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న గుంజన్‌ చౌదరి పాఠశాలకు ఆలస్యంగా వచ్చిదని ఆగ్రహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సదరు టీచర్‌పై దాడి చేసింది.
ఆ సమయంలో టీచర్‌ దుస్తులు కూడా కాస్తమేర చిరిగిపోయాయి. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. ఈ గొడవలో టీచర్‌ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గతంలో ఉత్తరప్రదేశ్‌లో లేడీ ప్రిన్సిపాల్‌ స్కూల్లో ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియో ఇటీవలే వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇది గమనించి వీడియో తీసిన లేడీ టీచర్‌ చేయి కొరికింది. ఇటుక రాయితో ఆమెను కొట్టింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form