కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

Published on 

బ్రెజిల్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దక్షిణ రాష్ట్రమైన రియో ​​గ్రాండే దో సుల్ భారీ వర్షాలతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ప్రకారం, ఇప్పటికే 74 మంది వ్యక్తులు గల్లంతయ్యారని సమాచారం.

కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి చెందగా, అనేకమంది గల్లంతయ్యారని తెలుస్తోంది. చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా దీనిని అక్కడి వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

కూలిపోయిన ఇళ్లు, వంతెనలు మరియు రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి అత్యవసరన రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విపత్తు వాతావరణ సంఘటన తర్వాత ఈ ప్రాంతం పట్టుకోల్పోవడంతో గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 12 విమానాలు, 45 వాహనాలు, 12 బోట్లను రంగంలోకి దించామని, సుమారు 700 మంది సైనికులు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్స్‌లో పాల్గొంటున్నారు అధికారులు పెర్కొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form