కేసీఆర్ బ‌స్సు తనిఖీ

Published on 

TS : పార్లమెంట్ ఎన్నికలలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జ‌గిత్యాల పర్యటనలో వున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బ‌స్సును ఎన్నిక‌ల అధికారులు త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఎన్నిక‌ల అధికారుల‌కు స‌హ‌క‌రించారు. బ‌స్సులో ఎలాంటి న‌గ‌దు లేక‌పోవ‌డంతో ఎన్నిక‌ల అధికారులు వెనుదిరిగారు.

అంతకు ముందు కేసీఆర్ జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ గారు సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురువు జైశెట్టి రమణయ్య.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form