కేరళలోని కోజికోడ్‌లో ఉన్న నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైకి చెందిన యోగేష్ నాథ్ అనే విద్యార్థి ఎన్ఐటీలో మూడవ సంవత్సరం మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ రోజు తెల్లవారుజామూన 5.30 గంటల ప్రాంతంలో హాస్టల్ క్యాంపస్ (NIT hostel) బిల్డింగ్ లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సూసైడ్ చేసుకోవడానికి ముందు అతను పేరెంట్స్‌కు మెసేజ్ చేశాడని, అయితే క్యాంపస్ అధికారులకు పేరెంట్స్ ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేసేలోపు యోగేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. అతన్ని వెంటనే కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ద్రువీకరించారు. అటాప్సీ నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యలు పెరగడానికి అకడమిక్ ఒత్తిడి, తగిన కౌన్సెలింగ్ అందకపోవడమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.